Share News

TSRTC: 2 రోజుల్లో కోటిన్నర మంది!

ABN , Publish Date - May 14 , 2024 | 04:35 AM

త రెండు రోజుల్లో టీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో 1.50 కోట్ల మంది రాకపోకలు సాగించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన సోమవారం కొండాపూర్‌ చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేయడానికి స్వగ్రామాలకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

TSRTC: 2 రోజుల్లో కోటిన్నర మంది!

  • ఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయి రాకపోకలు

హైదరాబాద్‌ సిటీ, మే 13 (ఆంధ్రజ్యోతి): గత రెండు రోజుల్లో టీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో 1.50 కోట్ల మంది రాకపోకలు సాగించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన సోమవారం కొండాపూర్‌ చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేయడానికి స్వగ్రామాలకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రోజూ 55లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ పోలింగ్‌ నేపథ్యంలో గత రెండు రోజుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఇది సంక్రాంతి రద్దీ కన్నా 10శాతం అధికమని ఆర్టీసీ అధికారులు చెప్పారు

Updated Date - May 14 , 2024 | 04:35 AM