Share News

Revanth Reddy: అస్సలు తగ్గొద్దు.. ముఖ్యనేతలకు రేవంత్ కీలక సూచనలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:08 PM

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

Revanth Reddy: అస్సలు తగ్గొద్దు.. ముఖ్యనేతలకు రేవంత్ కీలక సూచనలు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అస్సలు తగ్గొద్దంటూ పలు కీలక సూచనలు చేశారు. కాళేశ్వరం కుంగిపోవడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

2 లక్షల మందితో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో సభ పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. అయితే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని పిలవాలని నిర్ణయించారు. 13 సీట్లకు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడానికి కృషి చేయాలని రేవంత్ తీర్మానించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ హరీశ్‌ చౌదరి, మంత్రులతో పాటు ఇతర పీఈసీ, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Updated Date - Feb 06 , 2024 | 09:09 PM