Pushpa 2 Stampede: పోలీసుల నోటీసులకు రిప్లై ఇచ్చిన సంధ్య థియేటర్
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:12 PM
Sandhya Theatre Stampede: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది.
హైదరాబాద్, డిసెంబర్ 28: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది. 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించింది థియేటర్ యాజమాన్యం. సంథ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని.. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం తన రిప్లైలో పేర్కొంది. 4, 5 తేదీల్లో థియేటర్‌ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందన్నారు. గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్‌లో సినిమాలకు వచ్చారన్నారు. ఇకపోతే సంధ్య థియేటర్‌లో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్‌కి ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా ఉందని ఈ రిప్లైలో థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4వ తేదీన రిలైజన్ విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జు ఫ్యామిలీతో సహా వచ్చారు. హీరోయిన్, మిగతా చిత్రబృందం కూడా థియేటర్‌కు వచ్చింది. సెలబ్రిటీస్‌ను చూడటానికి అభిమానులు పోటెత్తడంలో తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయాడు. బ్రెయిన్‌కి ఆక్సీజన్ అందకపోవడంతో కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం శ్రీతేజ్‌కు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
శ్రీతేజ్ కుటుంబానికి పరిహారం..
థియేటర్‌లో తొక్కీసలాట ఘటన సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేవతి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సైతం సీరియస్ అయ్యింది. ప్రభుత్వం సైతం అసెంబ్లీ వేదిగా ఈ ఘటనను ఖండించింది. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ వ్యవహారల శైలి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదు.. చిత్ర బృందం తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితం కూడా గడిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఇంకా రచ్చ రేపుతోంది. ఇదిలాఉంటే.. శ్రీతేజ్ కుటుంబానికి చిత్ర బృందం తరఫున రూ. 2 కోట్లు పరిహారం ప్రకటించారు అల్లు అరవింద్. ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 25 లక్షలు అందజేశారు.
Also Read:
నితీష్ రెడ్డిపై పవన్ కీలక కామెంట్స్
ట్రాక్టర్ నడపడానికి లైసెన్స్ అవసరమా..?
For More Telangana News and Telugu News..