SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:52 AM
600 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల నియామకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
600 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల నియామకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు 2025 జనవరి 16 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వారితోపాటు చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు ఈ పోస్టులకు అర్హులు. 2025 మార్చి 8, 15 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు, ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు.