Share News

Farmers: ‘రుణమాఫీ’ పేరుతో సైబర్‌ మోసాలు: డీజీపీ

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:08 AM

పండుగల సమయంలో ఆఫర్లు.. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్లు, బ్యాంకు లోన్లు, ఉద్యోగావకాశాలు.. ఇతర సమయాల్లో ట్రాఫిక్‌ చలాన్లు..!

Farmers: ‘రుణమాఫీ’ పేరుతో సైబర్‌ మోసాలు: డీజీపీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పండుగల సమయంలో ఆఫర్లు.. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్లు, బ్యాంకు లోన్లు, ఉద్యోగావకాశాలు.. ఇతర సమయాల్లో ట్రాఫిక్‌ చలాన్లు..! ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఇప్పుడు రైతులను టార్గెట్‌గా చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘రుణమాఫీ’ని ఇప్పుడు ఎరగా మార్చుకుని, సరికొత్త మోసానికి తెరతీశారు.


‘‘కింది లింకును క్లిక్‌ చేసి, రిజిస్టర్‌ అయితే.. రుణమాఫీకి అర్హులవుతారు’’ అంటూ వాట్సాప్‌, ఎస్సెమ్మెస్‌ ద్వారా లింకులను పంపుతున్నారు. ఆ లింకులను క్లిక్‌ చేసిన వారి స్మార్ట్‌ఫోన్లలోకి రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌(ర్యాట్‌)ను చొప్పించి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలారాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు వెలుగు చూడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. రైతుబంధు పేరుతో వచ్చే సందేశాలను నమ్మి, అపరిచిత లింకులపై క్లిక్‌ చేయొద్దని డీజీపీ జితేందర్‌ హెచ్చరించారు.

Updated Date - Jul 19 , 2024 | 03:08 AM