Share News

Khammam: భర్త పెన్షన్‌ డబ్బులు భార్యకు ఇవ్వడానికి లంచం

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:23 AM

ఇటీవలే చనిపోయిన విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన పెన్షన్‌ డబ్బులను ఆయన భార్యకు ఇప్పించేందుకు రూ.40వేలు లంచం అడిగిన సీనియర్‌ అకౌంటెంట్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Khammam: భర్త పెన్షన్‌ డబ్బులు భార్యకు ఇవ్వడానికి లంచం

  • ఏసీబీకి చిక్కిన ఖమ్మం ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 9 (ఆంరఽధజ్యోతి): ఇటీవలే చనిపోయిన విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన పెన్షన్‌ డబ్బులను ఆయన భార్యకు ఇప్పించేందుకు రూ.40వేలు లంచం అడిగిన సీనియర్‌ అకౌంటెంట్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా సుబ్లేడు పీహెచ్‌సీలో అటెండర్‌గా ఉద్యోగ విరమణ చేసిన మల్లయ్య ఇటీవల మరణించాడు. మల్లయ్య పెన్షన్‌ డబ్బులు రూ.4లక్షలు ఆయన భార్యకు రావాల్సి ఉంది. అయితే, ఆ సొమ్మును ఇప్పించేందుకు తనకు రూ.40వేలు ఇవ్వాలని ఖమ్మం కలెక్టరేట్‌లోని ట్రెజరీ విభాగంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కట్టా నగేశ్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సోమవారం బాధిత మహిళ డబ్బులు ఇస్తుండగా నగేశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 04:23 AM