Share News

IIM-Bangalore: ఐఐఎం-బీ డైరెక్టర్‌,ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:27 AM

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం-బీ) డైరెక్టర్‌ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదయినట్టు శనివారం పోలీసులు తెలిపారు. తనను కులపరంగా వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం డాక్టర్‌ గోపాల్‌దాస్‌ అనే దళిత అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు.

IIM-Bangalore: ఐఐఎం-బీ డైరెక్టర్‌,ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు

  • ఫిర్యాదు చేసిన దళిత అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆరోపణలను ఖండించిన యాజమాన్యం

బెంగళూరు, డిసెంబరు 21: బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం-బీ) డైరెక్టర్‌ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదయినట్టు శనివారం పోలీసులు తెలిపారు. తనను కులపరంగా వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం డాక్టర్‌ గోపాల్‌దాస్‌ అనే దళిత అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ చేసిన దర్యాప్తు ఆధారంగా సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సూచనల మేరకు ఆ 8 మందిపై ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారని, సమాన అవకాశాలు కల్పించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను ఐఐఎం-బీ ఖండించింది.


ఆయన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిభను గుర్తించి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నియమించినట్టు తెలిపింది. నిజానికి డాక్టర్‌ గోపాల్‌దాస్‌ తమ పట్ల వివక్ష చూపుతున్నారని కొందరు పరిశోధక విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిగిందని తెలిపింది. వారి ఆరోపణలు నిజమేనని తేలిందని గుర్తు చేసింది. ఈ కేసుపై చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్టు పేర్కొంది. ఈ కేసులో తమకు బెయిల్‌ లభించిందని సంబంధిత ప్రొఫెసర్లు చెప్పగా, అందుకు సంబంధించిన పత్రాలేవీ తమకు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 03:27 AM