N. Balram: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో లక్ష్యాలు చేరుకోవాలి
ABN , Publish Date - Dec 15 , 2024 | 05:00 AM
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 108 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని, రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 108 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని, రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ... అదే మోతాదులో బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. అధికారులతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎప్పటికప్పుడు రైల్వే అధికారులతో సంప్రదిస్తూ వినియోగదారులకు సకాలంలో అందజేయాలని సూచించారు. లక్ష్యాల మేరకు ఉత్పత్తి సాధిస్తున్న గనులను, ఏరియాలను అభినందిస్తూ, వెనుకబడి ఉన్న ఏరియాలు ఇప్పుడు పుంజుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.