Share News

Niranjan Reddy: లైడిటెక్టర్‌ టెస్టు రేవంత్‌కే పెట్టాలి..

ABN , Publish Date - May 30 , 2024 | 03:14 AM

ప్రజా ప్రతినిధుల కొనుగోలులో లైవ్‌లో పట్టుబడ్డ రేవంత్‌ రెడ్డికే లై డిటెక్టర్‌ టెస్టు పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు లై డిటెక్టర్‌ టెస్టు పెట్టాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సీఎం స్థాయిలోని వ్యక్తి ఒక మాజీ సీఎంను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు.

Niranjan Reddy: లైడిటెక్టర్‌ టెస్టు రేవంత్‌కే పెట్టాలి..

  • లీగల్‌ సెన్స్‌ లేకుండా ట్యాపింగ్‌ ఆరోపణలు

  • కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రతినిధుల కొనుగోలులో లైవ్‌లో పట్టుబడ్డ రేవంత్‌ రెడ్డికే లై డిటెక్టర్‌ టెస్టు పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు లై డిటెక్టర్‌ టెస్టు పెట్టాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సీఎం స్థాయిలోని వ్యక్తి ఒక మాజీ సీఎంను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ నేతలు కావాలనే కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేశారని, అది విఫల ప్రాజెక్టయితే నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు కనీసం లీగల్‌ సెన్స్‌ లేకుండా.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆరోపణలకు దిగుతున్నారని, లీకులిచ్చి ఏదో సాధించినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విచారణను ప్రభావితం చేసేలా లీకులివ్వడం కూడా నేరమేనన్నారు. మూడ్రోజుల రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్‌ 1న పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి గన్‌పార్క్‌ అమర వీరుల స్తూపం వరకు, అక్కడి నుంచి సెక్రటేరియట్‌ సమీపంలోని అమరుల జ్యోతి స్మారక చిహ్నం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ తెలిపారు. మొత్తంగా వేయి మంది కళాకారులు, 10 వేల మందితో కవాతు నిర్వహిస్తామన్నారు. రెండో తేదీన తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ జాతీయ జెండా, పార్టీ జెండా ఎగరేస్తారని వెల్లడించారు.

Updated Date - May 30 , 2024 | 03:14 AM