Seethakka: బీఆర్‌ఎస్ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు
ABN , Publish Date - Oct 18 , 2024 | 03:56 AM
ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను బంద్ పెట్టారన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు.
గత ప్రభుత్వం ఖర్చుపెట్టిన డబ్బుకు పది రెట్ల ప్రయోజనాలు మహిళలకు కల్పిస్తున్నాం: సీతక్క
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను బంద్ పెట్టారన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాసిరకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను మహిళలకు కల్పిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఏడాదికి పెట్టిన ఖర్చు రూ.300 కోట్లు మాత్రమేనని, దానికి పది రెట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఒక నెలకు అయ్యే ఖర్చే రూ.332 కోట్లు అని వివరించారు. మహిళల గౌరవాన్ని నిలబెడుతూ వారిని ఆర్థికంగా బలోపేతం చేేసందుకు చేయూత ఇస్తున్నామని తెలిపారు.