Share News

Mahabubabad: కూలిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు: మంత్రి సీతక్క

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:55 AM

మహబూబాబాద్‌ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం మంత్రి సీతక్క అధికారులతో కలిసి పర్యటించారు.

Mahabubabad: కూలిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు: మంత్రి సీతక్క

మహబూబాబాద్‌, కేసముద్రం, హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం మంత్రి సీతక్క అధికారులతో కలిసి పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలను పరిశీలించారు. వర్షాలతో కూలిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, జిల్లాలో మూడు చోట్ల జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. ప్రధానంగా మహబూబాబాద్‌-మరిపెడ మార్గంలోని పురుషోత్తమయగూడెం హైలెవల్‌ వంతెనకు మానుకోట వైపు జాతీయ రహదారి 365 ఒక కిలోమీటర్‌ అప్రొచ్‌ రోడ్డు కిలోమీటర్‌ మేర కొట్టుకుపోయి సుమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 03:55 AM