MahaKumbh Mela: మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:15 AM
మహాకుంభ మేళా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
నిర్వహణ కారణాలతో 24 రైళ్ల రద్దు: దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంఽధ్రజ్యోతి): మహాకుంభ మేళా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 8 రైళ్లను నడుపుతుండగా, గుంటూరు నుంచి 4, నాందేడ్ నుంచి 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 19 నుంచి 27 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాట్లో ఉంటాయని పేర్కొన్నారు. కాగా ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కారణాల వల్ల 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
కొన్ని రైళ్లు ఈ నెల 21 నుంచి 28 వరకు, మరికొన్ని రైళ్లను ఈ నెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి చిత్తాపూర్, కాచిగూడ-మిర్యాలగూడ, కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్, నడికుడి నుంచి కాచిగూడ, నడికుడి-మిర్యాలగూడ, తిరుపతి-కాట్పాడి, విజయనగరం నుంచి విశాఖపట్నం, పలాస నుంచి విశాఖపట్నం, రాజమండ్రి-విశాఖపట్నం, కాట్పాడి నుంచి జోలార్‌పేట మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు.