Special trains: ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు 42 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Nov 22 , 2024 | 07:48 AM
ఈ నెల 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(Railway Recruitment Board) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్: ఈ నెల 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(Railway Recruitment Board) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు గురువారం తెలియజేశారు. 24, 25, 26, 28, 29వ తేదీల్లో గుంటూరు- సికింద్రాబాద్(07101), 24, 25, 26, 28 తేదీల్లో సికింద్రాబాద్- గుంటూరు(07102), కరీంనగర్- కాచిగూడ (07103), కాచిగూడ- కరీంనగర్ (07104), 23న నాందేడ్- తిరుపతి(Nanded-Tirupati) (07105) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నకిలీ ఆర్టీఓ గుట్టు రట్టు
అలాగే.. 24న తిరుపతి- నాందేడ్ (07106), 24, 26, 28, 29 తేదీల్లో కాకినాడ టౌన్- తిరుపతి (07107), తిరుపతి- కాకినాడ టౌన్ (07108) 24, 25, 26 తేదీల్లో కాచిగూడ- కర్నూల్ సిటీ (07109), కర్నూల్ సిటీ- కాచిగూడ (07110), 24, 25, 26, 27 తేదీల్లో హుబ్లీ- కర్నూల్ సిటీ (07315), 25, 26, 27, 28 తేదీల్లో కర్నూల్ సిటీ- హుబ్లీ (07316) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News