Sridhar Babu: హామీలన్నింటినీ అమలు చేసితీరుతాం: దుద్దిళ్ల
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:57 AM
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
గీసుగొండ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి గీసుగొండ మండల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలను అందచేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో నిరపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు.