Share News

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షురూ..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:56 AM

పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రారంభించింది.

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షురూ..!

  • ఆగస్టు 2, 3 తేదీల్లో ఓటరు జాబితాపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రారంభించింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు సంబంఽధించిన ఓటరు జాబితాను సిద్ధం చేయడంపై ఆగస్టు 2, 3 తేదీల్లో జిల్లాల వారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.


ఇందుకుగాను ఒక్కో జిల్లా నుంచి ఐదుగురు ఆపరేటర్ల పేర్లతో జాబితాను ఈనెల 31వ తేదీ లోపు మెయిల్‌ ద్వారా పంపాలని కలెక్టర్లకు సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

Updated Date - Jul 28 , 2024 | 03:56 AM