Share News

Hyderabad: భారీగా బదిలీలు..

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:19 AM

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీస్థాయిలో 40 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక ఐఎ్‌ఫఎస్‌ అధికారి, ఒక నాన్‌-కేడర్‌ అధికారిని బదిలీ చేసి పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో (నంబర్‌ 876) జారీ చేశారు.

Hyderabad: భారీగా బదిలీలు..

  • ఒకేసారి 40 మంది ఐఏఎస్‌ లకు స్థానచలనం

  • ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఎఫ్‌ఎస్‌, మరో నాన్‌క్యాడర్‌ కూడా!

  • ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా

  • ఆయనకే ప్లానింగ్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు

  • సాధారణ పరిపాలన శాఖ పూర్తిస్థాయి కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి

  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు

  • అశోక్‌రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డికి మళ్లీ కీలక బాధ్యతల అప్పగింత

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీస్థాయిలో 40 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక ఐఎ్‌ఫఎస్‌ అధికారి, ఒక నాన్‌-కేడర్‌ అధికారిని బదిలీ చేసి పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో (నంబర్‌ 876) జారీ చేశారు. 1998 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభిృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆయనను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ప్రణాళిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు మరో ముఖ్యకార్యదర్శిని నియమించే వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశించింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.


కీలకమైన సాధారణ పరిపాలన(జీఏడీ) శాఖకు పూర్తిస్థాయి కార్యదర్శిగా సి.సుదర్శన్‌ రెడ్డిని నియమించింది. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌గా ఉన్న కె.అశోక్‌రెడ్డిని బదిలీ చేసి, కీలకమైన వాటర్‌ బోర్డు ఎండీగా నియమించింది. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఈవీ నర్సింహారెడ్డిని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌గా నియమించింది. నాన్‌క్యాడర్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ పి.ఉపేందర్‌రెడ్డిని బదిలీ చేసి, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా నియమించింది. అవినీతి నిరోధక సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌-2 వైవీఎస్‌ సుధీంద్రను.. హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పోస్టులో నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న పి.సీతారామ్‌ను తెలంగాణ యాంటీ నార్కొటిక్‌ బ్యూరోలో ఎస్పీగా నియమించింది. వీరికి సంబంధించి హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

14.jpg

Updated Date - Jun 25 , 2024 | 04:19 AM