Hyderabad: నీట్‌పై చలో రాజ్‌భవన్ ఉద్రిక్తం..
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:15 AM
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సోమవారం మధ్యాహ్నం పీపుల్స్ ప్లాజా నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ వైపునకు వెళ్లేందుకు విద్యార్థులు, యువకులు పరుగులు తీయడంతో పోలీసులు వారిలో చాలా మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులు, యువత మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. పలు దఫాలుగా అరెస్టు చేసిన వారిని వాహనాల్లో పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముట్టడి సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా ఎన్‌ఎ్‌సయూఐ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్, పీడీఎ్‌సయూ, వీజేఎస్, డీవైఎ్‌ఫఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, పీవైసీ, వైజేఎస్, వైటీఎస్, ఏఐపీఎ్‌సవో తదితర యూనియన్ల విద్యార్థులు, యువతను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
చలో రాజ్ భవన్ సందర్భంగా యువత.. పోలీసుల వలయాలను చేధించుకొని ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపునకు దూసుకువెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. పీడీఎ్‌సయూకు చెందిన గడ్డం శ్యాం అనే యువకుడిని అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించగా అతను వ్యాన్‌లో అలజడి చేశాడని పోలీసులు వ్యాన్‌లోనే అతన్ని కొట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐవైఎ్‌ఫకు చెందిన సత్యప్రకాష్ అనే యువకుడు పోలీసు పెట్రోలింగ్ వాహనం పైకెక్కగా కారు అద్దం పగిలిపోయింది. అతడిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. నీట్ పేపర్‌ను కొన్నట్టు విద్యార్థులు చెప్పినా ప్రధాని మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించకపోవడం హేయమైన చర్య అని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్‌తో 24లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తిరిగి నీట్ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు.