Share News

Supreme Court: నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:36 AM

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

Supreme Court: నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేపీ పార్టీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో వల్ల తాము నష్టపోతున్నామని ఈ నెల 17న రాంబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది మోహిత్‌ రావు ఈనెల 18న ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే విచారించలేమని సోమవారం విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. అయితే సోమవారమే తెలంగాణలో గ్రూప్‌ -1 పరీక్ష ఉండడం గమనార్హం.

Updated Date - Oct 21 , 2024 | 03:36 AM