Hyderabad: 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:04 AM
ఈనెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లు..
ముగ్గురు సంతానం ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి చాన్స్
వీఏవో, వీఆర్‌వో తరహాలో కొత్త పోస్టు.. నియామకాలు
రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ మరో బిల్లు
ఇవి కాకుండా మరో ఐదు ఆర్డినెన్స్‌లు
రైతు భరోసా విధివిధానాలపై చర్చ
హైదరాబాద్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఈనెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 9న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభ లు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో ఇద్దరు వరకు సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోతోంది.
దీనికి సంబంధించినదే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు. అలాగే ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి, కొత్త రెవెన్యూ చట్టా న్ని తీసుకొచ్చేందుకుఆర్‌వోఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోనుంది. అలాగే ఇదివరకు ఉన్న గ్రామ సహాయకులు(వీఏవో), గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో) తరహాలో ప్రభుత్వం ఒక కొత్త పోస్టు ను సృష్టించి, నియామకాలు చేయనుంది. సర్వీసులో ఉన్న కొంత మందిని, ప్రత్యక్ష ఎంపిక ద్వారా మరికొంత మందిని ఈ పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి. ఇలాంటి అంశాలన్నీ ఆర్‌ఓఆర్ బిల్లులో ఉన్నాయి. ఈ కొత్త బిల్లులు కాకుండా మరో ఐదు ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెట్టి ఆమోదించనుంది.
రైౖతు భరోసాపై చర్చ
ఈ సమావేశాల్లో రైతు భరోసా పథకంపై కీలక చర్చ జరగనుంది. దీని విధివిధానాలపై ఇప్పటికే ప్రభు త్వం ఒక ముసాయిదాను తయారు చేసింది. రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చే యాలి, ఎలాంటి భూములకు ఇవ్వాలి, కౌలు రైతుల సంగతి ఏమిటి? వంటిఅంశాలపై చర్చిస్తారు.