Share News

Bathukamma: రెండో రోజు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే

ABN , Publish Date - Oct 03 , 2024 | 09:51 AM

Telangana: బతుకమ్మ తయారీలో తంగేడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి.ఈ పూవులను తప్పని సరిగా ఉండేటట్లు చేసుకుంటారు మహిళలు. బతుకమ్మను పేర్చిన తరువాత గౌరమ్మను కూడా చేస్తారు. ఈరోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దలకంటే పిల్లలే సందడిగా జరుపుకుంటారు.

Bathukamma: రెండో రోజు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే
Telangana Bathukamma Festival Special

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ఆశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య రోజు నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. తొలిరోజు (అక్టోబర్ 2) ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ వేడుకలు షురూ అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులు. నిన్న ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసి ఆడి పాడిన మహిళలు రెండో రోజు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకులు బతుకమ్మను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ బతుకమ్మను చిన్నపిల్లలు చేస్తుంటారు. అలాగే అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అటుకులు నైవేద్యంగా ఇవ్వడం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరువచ్చిందని చెబుతుంటారు మన పెద్దలు.

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే


ఆ రెండు పూలు ఎంతో ముఖ్యం...

బతుకమ్మ పండుగ రెండో రోజు అవడంతో రెండు వరుసలతో బతుకమ్మను పేరుస్తారు మహిళలు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం ఆచరించి... ఇళ్లును శుభ్రం చేసిన తరువాత బతుకమ్మ కోసం తెచ్చిన పూలతో అటుకుల బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మ తయారీలో తంగేడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి.ఈ పూవులను తప్పని సరిగా ఉండేటట్లు చేసుకుంటారు మహిళలు. బతుకమ్మను పేర్చిన తరువాత గౌరమ్మను కూడా చేస్తారు. ఈరోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దలకంటే పిల్లలే సందడిగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు నైవేద్యంగా అటుకలను సమర్పిస్తారు కాబట్టే అటుకుల బతుకమ్మ అని పేరు వచ్చిందని నానుడి. బతుకమ్మ చుట్టూ చిన్నారులు ఆడి పాడిన తర్వాత వారికి ఎంతో ఇష్టమైన బెల్లం, అటుకులను పంచిపెడతారు పెద్దలు. వాటిని ఎంతో ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..


చూడముచ్చటైన బతుకమ్మ...

ముందుగా... ఒక రాగి పళ్ళెం తీసుకుని దాని మీద ముందుగా తామర ఆకులు లేదా గునుగు, తంగేడు పూల ఆకులను పరుస్తారు. అనంతరం గునుగు పూలతో ఓ వరుస పెట్టిన తర్వాత రకరకాల పూలతో బతుకమ్మను సిద్ధం చేస్తారు.త్రికోణంలో వచ్చేలా బతుకమ్మను పేరుస్తారు. అనంతరం గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ చెంత ఉంచుతారు. అనంతరం అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. రకరకాల పూలతో ముఖ్యంగా గునుగు, తంగేడు పూలతో చూడముచ్చగా, ఎంతో ఆకర్షణీయంగా బతుకమ్మను పేరుస్తారు మహిళలు. మరోవైపు ఈరోజు అటుకుల బతుకమ్మతో పాటు దేవీ నవరాత్రులు కూడా ప్రారంభంకానున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఇవి కూడా చదవండి...

killed ఆరేళ్ల అస్పియాను చంపేశారు

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..

Read Latest Devotional News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 10:10 AM