Share News

Telangana: డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే నేటి నుంచి..

ABN , Publish Date - Oct 03 , 2024 | 08:59 AM

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతీ నియోజక వర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణ డివిజన్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది.

Telangana: డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే నేటి నుంచి..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో గురువారం నుంచి అధికారులు డిజిటల్ కార్డుల (Digital Cards) కోసం ఇంటింటి సర్వే (Door to Door Survey ) నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ సిక్ విలేజి హాకీ గ్రౌండ్స్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతీ నియోజక వర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణ డివిజన్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ 238 గ్రామాలు, డివిజన్లలో గురువారం నుంచి డిజిటల్ కార్డుల సర్వే జరుగుతుంది. అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేయనున్నారు. ఇంటికి యజమానిగా మహిళ.. మహిళ పేరు తర్వాత ఆ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారు. ఫ్యామిలీ ఆమోదిస్తేనే ఫోటో... అది కూడా ఒక ఆప్షన్ మాత్రమే.. ఈ రోజు నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసే ప్రక్రియ కొనసాగనుంది. 7వ తేదీతో పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియ పూర్తి కానుంది. పర్యవేక్షణ కోసం ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ చేస్తారు.


రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్

కాగా రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేషన్‌ కార్డులు లేనివారు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కారు.. తాజాగా ఈ ప్రక్రియను నిలిపివేసింది. ప్రభుత్వం నూతనంగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు తీసుకొస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రేషన్‌ సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ కార్డుల ద్వారానే అందజేయాలని నిర్ణయించినందున.. ప్రత్యేకంగా రేషన్‌ కార్డులు అవసరం లేదన్న భావనకు సర్కారు వచ్చింది. ఈ మేరకే దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్‌ వేసింది. కాగా, ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల పైలట్‌ ప్రాజెక్టు గురువారం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక మునిసిపాలిటీని, మరో గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకుని కార్యక్రమం చేపడుతున్నారు.


గురువారం నుంచి ఐదు పనిదినాల్లో.. కుటుంబాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం ఈ నెల 10న పైలట్‌ ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ గుర్తింపు కార్డును ఇస్తారు. కుటుంబ పెద్దగా ఇంటి మహిళను పేర్కొంటూ కార్డు జారీ చేస్తారు. కార్డులో కుటుంబ సభ్యులందరికీ కామన్‌గా పది అంకెలను కేటాయిస్తారు. వ్యక్తిగతంగా మరో పది నంబర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించి.. ఆయా రాష్ట్రాల్లోని విధానాలపై సర్కారుకు నివేదిక ఇచ్చింది. వాటన్నింటినీ పరిశీలించి తెలంగాణలో అత్యుత్తమ విధానాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించునున్న సీఎం

నాగచైతన్య, సమంత విడాకులు.. కేటీఆర్‌ వల్లే..

ఆరేళ్ల అస్పియాను చంపేశారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 03 , 2024 | 08:59 AM