Pension Rebellion Day: 1న పెన్షన్ విద్రోహ దినం.. జిల్లాల్లో నిరసనలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:35 AM
సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తామని, ఆ రోజు అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తామని, ఆ రోజు అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. తెలంగాణ ఉద్యోగుల ఐకాస శుక్రవారం టీఎన్జీవో కేంద్ర సంఘం భవనంలో సమావేశమైంది.
ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్ అధ్యక్షుడిగా, ఏలూరి శ్రీనివాస రావు జనరల్ సెక్రటరీగా 27 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సెప్టెంబరు 1ని పెన్షన్ విద్రోహ దినంగా తీర్మానం చేశారు.