TS Govt: ‘ధరణి’పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ABN , Publish Date - Jan 09 , 2024 | 10:54 PM
ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటూ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటూ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నారు. కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్ఏ సభ్యులు ఉండనున్నారు. ఇక సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. భవిష్యత్‌లో అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు.