Hyderabad: పంచాయతీరాజ్, పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్టంలో సవరణలు
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:03 AM
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం ప్రభుత్వం సభలో ఐదు ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టింది. ఇందులో పంచాయతీరాజ్ చట్టం, పురపాలక చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, వస్తుసేవల(జీఎస్టీ) చట్టం, వేతనాలు పింఛన్ల చట్టంలో సవరణలు ఉన్నాయి.
వస్తు సేవలు, వేతనాలు, పింఛన్ల చట్టంలోనూ..
శాసనసభలో ఐదు ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం ప్రభుత్వం సభలో ఐదు ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టింది. ఇందులో పంచాయతీరాజ్ చట్టం, పురపాలక చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, వస్తుసేవల(జీఎస్టీ) చట్టం, వేతనాలు పింఛన్ల చట్టంలో సవరణలు ఉన్నాయి. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సంబంధిత పురపాలికల్లో విలీనం చేయడానికి సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018, తెలంగాణ పురపాలక చట్టం-2019లో సవరణలు చేపట్టారు.
అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నిర్వహణ, ఆక్రమణలకు గురవుతున్న జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు సమర్థ పద్ధతులు అమలుచేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సహాయకంగా ప్రత్యేక ఏజెన్సీ సేవలు అనుమతించడం, జీఎస్టీ చట్టంలో సవరణలు వీటిలో ఉన్నాయి. అలాగే వివిధ రంగాలకు చెందిన నిపుణులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకునేందుకు తెలంగాణ వేతనాలు, పింఛన్ల చట్టంలో సవరణలు ఉన్నాయి.