Share News

ఎల్లుండి నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:24 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను సర్కారు విడుదల చేసింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది.

ఎల్లుండి నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు

  • రాష్ట్రవ్యాప్తంగా 9 రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను సర్కారు విడుదల చేసింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది.


  • రోజువారీ కార్యక్రమాలిలా..

డిసెంబర్‌ 1: 26 సమీకృత గురుకుల భవనాలకు శంకుస్థాపనలు.. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు.. సీఎం కప్‌ పోటీల ప్రారంభం

డిసెంబర్‌ 2: 16 నర్సింగ్‌, 28 పారా మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవం.. 213 కొత్త అంబులెన్స్‌లు, 33 ట్రాన్స్‌జెండర్ల క్లినిక్‌ల ప్రారంభం.. ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్ల పైౖలట్‌ ప్రాజెక్టు.

డిసెంబర్‌ 3: హైదరాబాద్‌ రైజింగ్‌ కార్యక్రమాలు.. ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు ఫ్లైఓవర్‌ ప్రారంభం.. రూ.150 కోట్ల విలువైన సుందరీకరణ పనులకు శ్రీకారం.

డిసెంబర్‌ 4: తెలంగాణ ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ భవనానికి శంకుస్థాపన.. వర్చువల్‌ సఫారీ, వృక్ష పరిచయ కేంద్రం ప్రారంభం.. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత

డిసెంబర్‌ 5: ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభం.. స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు.. మేడ్చల్‌, మల్లేపల్లి, నల్లగొండల్లో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం.. ఘట్‌కేసర్‌లో నిర్మించిన బాలికల ఐఐటీ కాలేజీ ప్రారంభం..

డిసెంబర్‌ 6: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం.. 244 విద్యుత్తు ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు.

డిసెంబర్‌ 7: రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనదళం ప్రారంభం.. తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

డిసెంబర్‌ 8: 7 కృత్రిమ మేధ (ఏఐ) ప్రాజెక్టులు, 130 కొత్త మీ-సేవ కేంద్రాలు ప్రారంభం.. యంగ్‌ ఇండియా వర్సిటీకి శంకుస్థాపన.. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.

డిసెంబర్‌ 9: లక్ష మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. ట్యాంక్‌బండ్‌పై ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు. డ్రోన్‌ షో, కళాకృతుల ప్రదర్శన,

Updated Date - Nov 29 , 2024 | 04:24 AM