Share News

Employee benefits: ఉద్యోగుల అంత్యక్రియల చార్జీలు 30వేలకు పెంపు

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:54 AM

ఉద్యోగుల అంత్యక్రియల చార్జీలను రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం వారి కుటుంబసభ్యులకు రూ. 20వేలు ఇచ్చేది.

Employee benefits: ఉద్యోగుల అంత్యక్రియల చార్జీలు 30వేలకు పెంపు

  • సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తేనే వర్తింపు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల అంత్యక్రియల చార్జీలను రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం వారి కుటుంబసభ్యులకు రూ. 20వేలు ఇచ్చేది. అయితే మొదటి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఈ చార్జీలను రూ.30 వేలకు పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేయగా ఆర్థికశాఖ ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది.


ఈ మేరకు అంత్యక్రియల చార్జీలను రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని క్యాటగిరీల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని, సర్వీసులో ఉన్నప్పుడు మరణించినవారికి మాత్రమే అంత్యక్రియల చార్జీలు ఉంటాయని తెలిపింది. వీటికి సంబంధించి సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవచ్చని అన్ని శాఖలకు సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం జారీ చేశారు.

Updated Date - Dec 03 , 2024 | 03:54 AM