Share News

Damodara : ప్రజలకు ఉపయోగపడేలా హెల్త్‌ కార్డులు

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:39 AM

తెలంగాణలో పౌరుల హెల్త్‌ ప్రొఫైల్‌, ఆరోగ్య కార్డులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రాథమిక సమాచారంతోనే వాటిని తయారుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

Damodara : ప్రజలకు ఉపయోగపడేలా హెల్త్‌ కార్డులు

  • సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పౌరుల హెల్త్‌ ప్రొఫైల్‌, ఆరోగ్య కార్డులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రాథమిక సమాచారంతోనే వాటిని తయారుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. హెల్త్‌ కార్డుల తయారీ, ఆరోగ్య కార్డుల పంపిణీపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు హెల్త్‌ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం సాయపడాలన్నారు. ఒకేసారి ప్రజలందరికీ రక్త పరీక్షలు చేయడం సాధ్యం కాదని, తొలుత ప్రాథమిక సచామారంతో ఆరోగ్య కార్డులు తయారు చేయాలన్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కమిషనర్‌ కర్ణన్‌కు సూచించారు.


  • రాజకీయ లబ్ధి కోసమే ఆ జీవోలు

రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు జీవోలు విడుదల చేసినంత మాత్రాన మెడికల్‌ కాలేజీలకు అనుమతులు రావని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. బుధవారం హరీశ్‌రావు ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టుకు అదే వేదికగా మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. గత సర్కారు హయాంలో మెడికల్‌ కాలేజీల్లో కనీసం ఒక్క ప్రొఫెసర్‌ను కూడా నియమించలేదని విమర్శించారు. కాలేజీలకు భవనాలు ఏర్పాటు చేయలేదని, అవసరమైన ఎక్వి్‌పమెంట్‌ కొనలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరమైన నిధులు కేటాయించి, వంద బెడ్ల దవాఖానాలను 220 పడకల ఆస్పత్రులుగా మార్చామన్నారు. ఇప్పటికైనా రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పడం మానేయాలని హరీశ్‌రావుకు హితవు పలికారు.

Updated Date - Sep 12 , 2024 | 03:39 AM