Lok Sabha Election Polling: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్..
ABN , Publish Date - May 13 , 2024 | 09:32 AM
Lok Sabha Election Polling 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.

ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లూ అర్జున్, ఎన్టీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ఇతర ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్, అల్లూ అర్జున్, చిరంజీవి దంపతులు, డైరెక్టర్ తేజ ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాని చేరుకుని ఓటు వేశారు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
రాష్ట్ర వ్యా్ప్తంగా జిల్లాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్దులు సైతం ఓపికతో ఓటు వేసేందుకు వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు వేస్తున్నారు. ప్రజలను సైతం తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు నాయకులు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి 9 గంటల వరకు చాలా జిల్లాల్లో 10 శాతం పైగానే పోలింగ్ నమోదైంది. దీంతో సాయంత్రం వరకు ఆయా జిల్లాల్లో దాదాపు 70 శాతం పైగానే పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.