Share News

DSC: ఎస్సీ వాటా 15ు పక్కన పెట్టి టీచర్ల నియామకాలు చేయాలి

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:33 AM

డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలలో ఎస్సీ వాటా 15 శాతం పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ మాదిగ సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది.

DSC: ఎస్సీ వాటా 15ు పక్కన పెట్టి టీచర్ల నియామకాలు చేయాలి

  • వర్గీకరణ అమలుతోనే మాదిగలకు న్యాయం

  • తెలంగాణ మాదిగ సంఘాల ఐక్య వేదిక

  • సీఎం రేవంత్‌కు వినతి పత్రం అందజేత

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలలో ఎస్సీ వాటా 15 శాతం పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ మాదిగ సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఐక్యవేదిక ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.


ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా టీచర్‌ ఉద్యోగాల భర్తీ చేసిన పక్షంలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. మాదిగల ఆర్తనాదాలు అర్థం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, చైర్మన్‌ నియామకాలు, కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లోనూ 15 శాతం ఎస్సీ రిజర్వేషన్‌ అమలు చేసి మాదిగలకు 10 శాతం పదవులు ఇవ్వాలని కోరారు.

Updated Date - Oct 04 , 2024 | 04:33 AM