Share News

FDI: రాష్ట్రానికి ఎఫ్‌డీఐల వెల్లువ

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:58 AM

రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ) ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2024 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి రూ. 12,864 కోట్లు వచ్చాయి.

FDI: రాష్ట్రానికి ఎఫ్‌డీఐల వెల్లువ

  • గత ఏడాదితో పోలిస్తే 33 శాతం వృద్ధి

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ) ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2024 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి రూ. 12,864 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో రూ.9,679 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే రూ. 3,185 కోట్లు అధికంగా రాగా.. వృద్ధి రేటు దాదాపు 33 శాతంగా నమోదైందని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం తెలిపింది. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.


ఈ జాబితా ప్రకారం ఈ ఆరు నెలల పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలలో దాదాపు 93 శాతం హైదరాబాద్‌కే వచ్చాయి. రాష్ట్ర రాజధానికి రూ.11,970 కోట్లు, రంగారెడ్డి జిల్లాకు రూ.680.5కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116.7కోట్లు, మెదక్‌కు 96.99 కోట్లు వచ్చాయి.

Updated Date - Dec 29 , 2024 | 03:58 AM