Share News

Young India Skills University: ఆరు కోర్సులు.. 2వేల మంది విద్యార్థులు!

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:17 AM

రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో రాష్ట్ర సర్కారు ఏర్పాటుచేస్తున్న ‘యంగ్‌ ఇండి యా స్కిల్స్‌ యూనివర్సిటీ’లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు నిర్వహించనున్నారు! తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడతారు.

Young India Skills University: ఆరు కోర్సులు.. 2వేల మంది విద్యార్థులు!

  • స్కిల్‌ వర్సిటీలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు

  • తొలుత 6 రంగాల్లో కోర్సులతో తరగతులు

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో రాష్ట్ర సర్కారు ఏర్పాటుచేస్తున్న ‘యంగ్‌ ఇండి యా స్కిల్స్‌ యూనివర్సిటీ’లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు నిర్వహించనున్నారు! తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడతారు. రెండువేల మందికి ప్రవేశాలు కల్పిస్తారు. క్రమంగా అడ్మిషన్ల సంఖ్యను 20 వేలకు పెంచుతారు.


ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తున్న ఈ వర్సిటీలో ఇంటర్‌ తర్వాత చదివే మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీలతో పాటు.. ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్‌ కోర్సులు ఉంటాయి. తెలంగాణలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ ఇప్పటికే గుర్తించింది.


సర్కారు గుర్తించిన ప్రాధాన్య రంగాల్లో.. ఫార్మా, కన్‌స్ట్రక్షన్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఈ కామర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, రిటైల్‌, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ తదితరాలున్నాయి. ప్రతి కోర్సుకూ సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీతో భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. ఈమేరకు ఆయా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.

Updated Date - Aug 01 , 2024 | 04:17 AM