Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 14 , 2024 | 07:47 AM
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లల కిడ్నాప్ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పిల్లలను ఎత్తుకెళుతుందని జనం భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌లో ఓ హిజ్రాను అనుమానించి దాడి చేశారు.
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లల కిడ్నాప్ (Children Kidnap) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పిల్లలను ఎత్తుకెళుతుందని జనం భయాందోళనకు గురవుతున్నారు. కిడ్నాప్‌నకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పేరంట్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్‌లో ఓ హిజ్రాను అనుమానించి దాడి చేశారు.
ఏం జరిగిందంటే..?
చిన్న పిల్లల కిడ్నాప్ వార్తలతో పేరంట్స్ తెగ భయపడుతున్నారు. నిజామాబాద్‌లో రాజు అనే యాచకుడిని అనుమానించారు. అతను హిజ్రా కావడం, పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో అతని పోలికలు కనిపించాయి. ఆ ముఠాలో అతను కూడా భాగస్వామి అనుకున్నారు. కోపంతో ఉన్న స్థానికులు రాజుపై దాడి చేశారు. పోలీసులు వచ్చే లోపు రాజు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు. దాడి చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటన కామారెడ్డిలో కూడా జరిగింది. సర్వే చేయడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై కొందరు దాడి చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.