Share News

CMs Meet: 5 గ్రామాలను కోరిన సీఎం రేవంత్

ABN , Publish Date - Jul 06 , 2024 | 08:46 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యలపై ప్రజా భవన్‌లో రెండు గంటలపాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇరు రాష్ట్రాల మంత్రులతో ఉప సంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖలవారీగా చర్చల కోసం అధికారులతో మరో కమిటీ వేస్తామని సూత్రప్రాయంగా తెలిపారు.

CMs Meet: 5 గ్రామాలను కోరిన సీఎం రేవంత్
CMs Meet

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యలపై ప్రజా భవన్‌లో రెండు గంటలపాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇరు రాష్ట్రాల మంత్రులతో ఉప సంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖలవారీగా చర్చల కోసం అధికారులతో మరో కమిటీ వేస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. చర్చల ద్వారా, పట్టు విడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని సమావేశంలో ముఖ్యమంత్రులు అంగీకారం తెలిపారు. నీటి పంపిణీపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాల్లో గల 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి అడిగారని తెలిసింది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను విలీనం చేయాలని కోరినట్టు సమాచారం. ఇదే అంశంపై కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిసింది. హైదరాబాద్‌లో కొన్ని భవనాలు తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి.

Updated Date - Jul 06 , 2024 | 08:46 PM