Share News

CM Revanth Reddy: వచ్చేనెల దావోస్‌కు రేవంత్‌

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:08 AM

దాదాపు 100 మందికిపైగా సీఈవోలు హాజరుకానున్న ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) వార్షిక సదస్సుకు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి సహా భారత్‌ నుంచి కనీసం ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు.

CM Revanth Reddy: వచ్చేనెల దావోస్‌కు రేవంత్‌

  • ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరు

  • భారత్‌ నుంచి చంద్రబాబు సహా ముగ్గురు సీఎంలు

  • నారా లోకేశ్‌తోపాటు పలు రాష్ట్రాల మంత్రులూ హాజరు

న్యూఢిల్లీ, డిసెంబరు 22: దాదాపు 100 మందికిపైగా సీఈవోలు హాజరుకానున్న ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) వార్షిక సదస్సుకు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి సహా భారత్‌ నుంచి కనీసం ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. వచ్చే నెల 20 నుంచి దావో్‌సలో ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్‌, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, తమిళనాడు మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్‌ ఖన్నా తదితరులు పాల్గొననున్నారు. స్విస్‌ స్కై రిసార్ట్‌లో జరిగే ఈ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.


ఈ ఏడాది ‘కొలాబరేషన్‌ ఫర్‌ ది ఇంటెలిజెంట్‌ ఏజ్‌’ అనే ప్రధాన థీమ్‌తో సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మంది దేశాధినేతలు, ప్రభుత్వాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. భారత్‌ నుంచి అదానీ, రిలయన్స్‌, టాటా, బిర్లా, భారతీ, మహీంద్రా, గోద్రెజ్‌, జిందాల్‌, బజాజ్‌, వేదాంత గ్రూపులు సహా పలు వాణిజ్య సమూహాల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, పౌర సమాజాల సభ్యులు కూడా హాజరుకానున్నారు. ‘ఇండియాస్‌ ఎకనమిక్‌ బ్లూప్రింట్‌’ సహా పలు సెషన్లలో భారత ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.

Updated Date - Dec 23 , 2024 | 05:09 AM