Karnataka: రేపు బెలగావికి సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 25 , 2024 | 10:00 PM
CWC Meeting: కర్ణాటకలోని బెలగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలు గురువారం మధ్యాహ్నాం ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

హైదరాబాద్, డిసెంబర్ 25: కర్ణాటకలోని బెలగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 11.00 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఛాపర్‌లో సీఎం రేవంత్ రెడ్డి బెలగావికి పయనమవుతారు. బెలగావిలో రెండు రోజుల పాటు ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభం కానున్నాయి.
మహాత్మా గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడిగా బెలగావిలో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదీకాక మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని డిసెంబర్ 26, 27వ తేదీల్లో బెలగావిలో ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు నవ సత్యాగ్రహ భైఠక్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు దాదాపు 200 మంది పార్టీలోని అగ్రనేతలను ఏఐసీసీ ఆహ్వానించింది.
మరోవైపు బెలగావి వెళ్లే ముందు టాలీవుడ్ ప్రముఖలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. టాలీవుడ్ సమస్యలపై వారితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అదీకాక పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సందర్బంగా రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. అతడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై సైతం సీఎం రేవంత్ రెడ్డితో జరిగే భేటీలో చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Also Read: రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
Also Read: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
Also Read: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
Also Read: నితీష్, నవీన్‌లకు భారతరత్న ఇవ్వాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ
Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ
Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి
For Telangana News And Telugu News