Share News

TGGENCO: జెన్‌కో పీపీఏలపై ఈఆర్‌సీ విచారణ

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:34 AM

రాష్ట్ర జెన్‌కోకు చెందిన రామగుండంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆర్‌టీఎ్‌స-బీతో ఏడాది కాలానికి, కొత్తగూడెం కేటీపీఎ్‌స-5కు

TGGENCO: జెన్‌కో పీపీఏలపై ఈఆర్‌సీ విచారణ

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జెన్‌కోకు చెందిన రామగుండంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆర్‌టీఎ్‌స-బీతో ఏడాది కాలానికి, కొత్తగూడెం కేటీపీఎ్‌స-5కు చెందిన 250 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నుంచి ఐదేళ్లకాలానికి విద్యుత్‌ కొనుగోలుకు వీలుగా పీపీఏల కొనసాగింపుపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) విచారణ జరపనుంది. దీనిపై ఈనెల 18వ తేదీలోగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కమిషన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ ఇచ్చింది.


రామగుండంలోని ప్లాంట్‌ 1971 అక్టోబరు 17 నుంచి, కేటీపీఎస్‌ ఐదో దశలోని 9 యూనిట్‌ 1997 మార్చి 31 నుంచి, పదో యూనిట్‌ 1998 ఫిబ్రవరి 28 నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఏ ప్లాంట్‌ నుంచైనా 25ఏళ్లపాటు పీపీఏ చేసుకుంటారు. అయితే మూడింటి పీపీఏలు గత మార్చి 31తో ముగిశాయి. దాంతో రామగుండం ప్లాంట్‌ నుంచి 2025 మార్చి 31దాకా, కొత్తగూడెం-5లోని రెండు యూనిట్ల నుంచి 2029 మార్చి 31వరకు విద్యుత్‌ కొనుగోలుకు తెలంగాణ డిస్కమ్‌లు జెన్‌కోతో ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై విచారణ జరిపి ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇవ్వనుంది.

Updated Date - Oct 05 , 2024 | 03:34 AM