Share News

TG Govt: వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి ఐచ్ఛికాలు కోరిన ప్రభుత్వం

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:07 AM

గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు కార్యాచరణ ప్రారంభించింది.

TG Govt: వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి ఐచ్ఛికాలు కోరిన ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు కార్యాచరణ ప్రారంభించింది. భూభారతి చట్టం-2024 చట్టసభల్లో ఆమోదం పొందిన తరుణంలో గ్రామస్థాయి సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో పనిచేసిన వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచే గ్రామ రెవెన్యూ పాలకులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న వారి నుంచి గూగుల్‌ ఫాంలో అభిప్రాయాలు సేకరించి పంపాలని కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నుంచి సోమవారం సర్క్యులర్‌ వెళ్లింది. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి డిసెంబరు 28 లోపల ప్రతిపాదనలు పంపాలని అందులో పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 04:07 AM