Share News

Hyderabad: స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే ‘డబుల్‌’తో పాటు పాతిక వేలు

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:53 AM

మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటూ స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసేవారికి ప్రభుత్వం ఆఫర్‌ ఇచ్చింది.

Hyderabad: స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే ‘డబుల్‌’తో పాటు పాతిక వేలు

  • మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆఫర్‌

  • హైదరాబాద్‌, రంగారెడ్డి కలెక్టర్ల ప్రకటన లంక బస్తీలో విషాదం.. గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి

హైదరాబాద్‌ సిటీ, రాజేంద్రనగర్‌, గోల్నాక, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటూ స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసేవారికి ప్రభుత్వం ఆఫర్‌ ఇచ్చింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటితోపాటు రూ.25 వేలు పారితోషికంగా ప్రభుత్వం ఇస్తుందని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఉండే ఇంటిని ఖాళీ చేసి వెళ్లేందుకు, అవసరాల నిమిత్తం పాతిక వేలు ఇస్తామని ప్రకటించారు. రాజేంద్రనగర్‌, గండిపేట్‌ మండలాలలో విస్తరించి ఉన్న మూసీ రివర్‌బెడ్‌ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వారు రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయాల వద్ద గ్రీవెన్స్‌ సెల్‌లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్‌ మూసీ పరివాక ప్రాంతం న్యూ తులసీరాంనగర్‌(లంక బస్తీ)కి చెందిన గానద శ్రీకుమార్‌(51) గుండెపోటుతో మృతి చెందారు. ఇండ్లను కూల్చివేస్తార నే ప్రచారం జోరుగా జరగడంతో నాలుగైదు రోజులుగా బెంగగా ఉన్న ఆయన బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఛాతీలో నొప్పి ఉందని కుటుంబసభ్యులతో చెప్పారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందారు. శ్రీకుమార్‌కు ముగ్గురు కుమారులున్నారు. ఘటనతో లంక బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Oct 03 , 2024 | 03:53 AM