Share News

Hyderabad: మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ఠ చర్యలు: జూపల్లి

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:59 AM

సమాజానికి హానికరమైన మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని, తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిద్దిడానికి సమైక్యంగా కృషి చేద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Hyderabad: మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ఠ చర్యలు: జూపల్లి

హైదరాబాద్‌,ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సమాజానికి హానికరమైన మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని, తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిద్దిడానికి సమైక్యంగా కృషి చేద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ‘డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం-సమాజాన్ని మేలు కొలుపుదాం’ పేరిట గురువారం రవీంధ్రభారతి ప్రాంగణంలో ప్రజానాట్యమండలి చేపట్టిన ప్రచార కళాజాత యాత్రను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ మార్పులోనూ, నవ సమాజ నిర్మాణంలోనూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్‌ కమిటీల్లో చేరి సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Aug 23 , 2024 | 03:59 AM