Share News

శాసన మండలిలో 4 బిల్లులకు ఆమోదం

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:16 AM

తెలంగాణ శాసన మండలి నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. శనివారం తెలంగాణ పురపాలికల సవరణ బిల్లు, హైదరాబాద్‌ మహానగర పురపాలక కార్పొరేషన్‌ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు, తెలంగాణ భూ భారతి -2024 బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.

శాసన మండలిలో 4 బిల్లులకు ఆమోదం

హైదరాబాద్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసన మండలి నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. శనివారం తెలంగాణ పురపాలికల సవరణ బిల్లు, హైదరాబాద్‌ మహానగర పురపాలక కార్పొరేషన్‌ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు, తెలంగాణ భూ భారతి -2024 బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయా బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం మండలి ఛైర్మన్‌ బిల్లులకు ఆమోదం తెలిపారు. ‘రైతు భరోసా’పై సభలో స్వల్ప కాలిక చర్చ జరగాల్సి ఉన్నా.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సభ్యులు తమ సందేహాలు, ప్రశ్నల్ని లిఖిత పూర్వకంగా చైర్మన్‌ ద్వారా ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. సమాధానాల్ని లిఖితపూర్వకంగా అందజేస్తామన్నారు. అనంత రం మండలిని ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ నిరవధికంగా వాయిదా వేశారు.


ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను పిలవాలి

ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను తప్పనిసరిగా ఆహ్వానించాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రొటోకాల్‌, శాసన నియమావళి ప్రకారం సభ్యుల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని మండలి సమావేశంలో ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర కార్యక్రమాలకు తప్పనిసరిగా సభ్యుల్ని ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబును ఆయన ఆదేశించారు. నియోజకవర్గ అభివృ ద్ధి నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Dec 22 , 2024 | 04:16 AM