Congress: ఝార్ఖండ్‌కు భట్టి, మహారాష్ట్రకు ఉత్తమ్, సీతక్క
ABN , Publish Date - Oct 16 , 2024 | 03:41 AM
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ మంత్రులను పార్టీ తరఫున సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ నియమించింది.
అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకులుగా నియమించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ మంత్రులను పార్టీ తరఫున సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ నియమించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులుగా నియమితులయ్యారు. భట్టితోపాటు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరి తదితర సీనియర్ నేతలకు ఝార్ఖండ్ బాధ్యతలు అప్పగించారు.
మరోపక్క, మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు మొత్తం 11 మందిని సీనియర్ పరిశీలకులుగా నియమించారు. ఇందులో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు చోటు దక్కింది. మరాఠ్వాడా ప్రాంతానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి సీతక్క సీనియర్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జారీ చేశారు.