TG News : రాష్ట్రాన్ని వణికిస్తున్న విష జ్వరాలు
ABN , Publish Date - Aug 28 , 2024 | 04:22 AM
రాష్ట్రంలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇద్దరి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో అతిసారతో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు
తొర్రూరు రూరల్/ నర్సంపేట టౌన్/ హన్వాడ, ఆగస్టు 27: రాష్ట్రంలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం గ్రామ పరిధిలోని కేవుల్లాతండాలో బానోత్ లచ్చిరామ్(58) అనే వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు జ్వరం ఎక్కువ కావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోన్న అర్జున్(17) 3రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. సోమవారం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లిలో వెంకటయ్య(72) అతిసారతో ప్రాణాలు వదిలాడు.