Share News

Hyderabad: బకెట్‌ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:30 AM

రాష్ట్రంలో టీజీఎండీసీ సహకారంతో ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి ఇసుక క్వారీలలో కొందరు అక్రమార్కులు బకెట్‌ దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలంగాణ మైన్స్‌ అండ్‌ సాండ్‌ లారీ అసోసియేషన్‌ ఆరోపించింది.

Hyderabad: బకెట్‌ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి

బర్కత్‌పుర, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీజీఎండీసీ సహకారంతో ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి ఇసుక క్వారీలలో కొందరు అక్రమార్కులు బకెట్‌ దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలంగాణ మైన్స్‌ అండ్‌ సాండ్‌ లారీ అసోసియేషన్‌ ఆరోపించింది. ఇసుక లారీలపై విజిలెన్స్‌, మైనింగ్‌, ఆర్టీఏ దాడులు వెంటనే నిలిపివేయాలని, క్వారీల్లో ఇసుక ఓవర్‌లోడ్‌ చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇసుక లారీ యజమానుల సమస్యలు-ప్రభుత్వ వైఖరి’ అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు.


సదస్సులో అసోసియేషన్‌ అధ్యక్షుడు సురభి దామోదర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు పి.యాదగిరిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి జె.పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. బకెట్‌ దందాతో ఇసుక లారీల్లో 7 నుంచి 10 టన్నులు అధికంగా లోడ్‌ చేస్తున్నారన్నారు. ఆర్టీఏ, పోలీసుల దాడులు పెరిగిపోయి అధిక లోడ్‌ కారణంగా చేయని తప్పునకు లారీ యజమానులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు దళారులు ఒక్కో లారీ నుంచి రూ.7-8 వేలు బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Dec 09 , 2024 | 03:30 AM