Share News

ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌కు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:09 AM

చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడంతో ఆ పథకానికి ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోవ డానికి వీలుగా ప్రతిపాద నలను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది.

ఇన్వె్‌స్టమెంట్‌  క్లియరెన్స్‌కు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

  • గోదావరి బోర్డుకు వివరాలివ్వాలని సీడబ్ల్యూసీ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడంతో ఆ పథకానికి ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోవ డానికి వీలుగా ప్రతిపాద నలను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. కేంద్రం నుంచి ప్రాజెక్టులకు సహాయం పొందాలంటే విధిగా ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోవాలి. ప్రాజెక్టుకు వెచ్చించే నిధులపై హేతుబద్ధత ఉందా...? లేదా...? వంటి అంశాలను నిర్ధారించుకోవాలి. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన కన్నెపల్లి గ్రామంలో గోదావరి నదిపై రూ.545.15 కోట్ల వ్యయంతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏఐబీపీ కింద సహాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రతిపాదనలు సమర్పించింది.


ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించగా టీఏసీ మినిట్స్‌తో పాటు రోజుకు ఏ మేర నీటిని తరలిస్తారు? రియల్‌ టైమ్‌ టెలిమెట్రీ విధానం ఏర్పాటు చేసి, గోదావరి బోర్డుకు వివరాలు అందించాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) కోరింది. ఇక తాజాగా ఏ మేరకు ప్రాజెక్టుపై ఖర్చుపెట్టారనే సమగ్ర వివరాలు అందించాలని పేర్కొంది. కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సహాయం అందించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు దఫాలు కేంద్రాన్ని కోరింది. అయితే ఖర్చుకు సంబంధించిన సమగ్ర వివరాలు సమర్పిస్తే ఏఐబీపీ కింద సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. అయితే దాన్ని సున్నితంగా అప్పటి ప్రభుత్వం తోసిపుచ్చింది. సమగ్ర వివరాలు అందిస్తే బండారం బయటపడుతుందనే కారణంతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోలేదని విమర్శలు వచ్చాయి.

Updated Date - Dec 17 , 2024 | 06:09 AM