Share News

TGSRTC: 19న ఈసీఐఎల్‌ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:04 PM

పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)కు ఈసీఐఎల్‌(కుషాయిగూడ) నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్‌ పి.చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

TGSRTC: 19న ఈసీఐఎల్‌ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు..

హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)కు ఈసీఐఎల్‌(కుషాయిగూడ) నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్‌ పి.చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న సాయంత్రం 7గంటలకు ఈ బస్సు ఈసీఐఎల్‌ నుంచి బయలుదేరి నాగారం, నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, తార్నాక, ఎంజీబీఎస్‌ మీదుగా కాణిపాకం, గోల్డెన్‌టెంపుల్‌ దర్శనం అనంతరం పౌర్ణమి రోజున 21న ఉదయం అరుణాచలం చేరుకుని భక్తుల గిరిప్రదక్షిణం పూర్తిచేసుకుని అదే రోజు సాయంత్రం అక్కడి నుంచి తిరిగి బయలుదేరి, 22న ఉదయం బస్సు ఈసీఐఎల్‌కు చేరుకుంటుందని డీఎం తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: జనసేన జెండాలో.. శ్రీచక్ర యంత్రాన్ని పెట్టడం అన్యాయం


ఈ ప్రత్యేక బస్సులో ఒకొక్కరికి (పిల్లలు/పెద్దలు)టికెట్‌ ధర రూ.3790లుగా నిర్ణయించారని పేర్కొన్నారు. దర్శనం, భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలని తెలిపారు. ఆసక్తిగల ప్రయాణీకులు టికెట్స్‌ బుకింగ్‌ కోసం ఆన్‌లెన్‌లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీజీఎస్ఆర్‌టీసీఆన్‌లైన్‌.ఇన్‌(www.tgsrtconline.in)లో గానీ, ఈసీఐఎల్‌ బస్‌టర్మినల్‌, నెరేడ్‌మెట్‌, నాగారం, మల్కాజిగిరిలోని ఏటీబీ ఏజెంట్‌ కౌంటర్‌లలో సంప్రదించి టికెట్‌ బుక్‌ చేసుకోవాలన్నారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 12:04 PM