Share News

TGSRTC: అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 10:55 AM

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)లో గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు రీజినల్‌ మేనేజర్‌ శ్రీలత తెలిపారు.

TGSRTC: అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

హైదనాబాద్: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)లో గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు రీజినల్‌ మేనేజర్‌ శ్రీలత తెలిపారు. ఈనెల 19వ తేదీన ఆర్టీసీ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌ ప్రాంతాల నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులు నడవనున్నాయి. ఎంజీబీఎస్‌ నుంచి ఒకరికి రూ.3,700లు చార్జీ వసూలు చేయనున్నారు. బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌ నుంచి రూ.3,900లు చార్జీ వసూలు చేయనున్నారు. 19న బయలుదేరే బస్సు 20న ఉదయం 8గంటలకు కాణిపాకం(Kanipakam), గోల్డెన్‌ టెంపుల్‌ దర్శనానంతరం బయలుదేరి రాత్రి 8గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.

ఇదికూడా చదవండి: Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి 80 ప్రత్యేక బస్సులు


21న మధ్యాహ్నం 3గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి 22న ఉదయం 6గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుంటుందని ఆర్‌ఎం వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామని, ముందుగా సీట్లను బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 99592 26249, 93465 59649, 96663 50995 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 10:55 AM