Tourist Information: విమానాశ్రయంలో పర్యాటక సమాచార కేంద్రం
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:59 AM
రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి విమానాల్లో వచ్చే యాత్రికుల కోసం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక సంస్థ సమాచార, రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
హైదరాబాద్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి విమానాల్లో వచ్చే యాత్రికుల కోసం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక సంస్థ సమాచార, రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పర్యాటక సంస్థ బషీర్‌బాగ్, బేగంపేట టూరిజం ప్యాలెస్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ యాత్రినివాస్, శిల్పారామంతో పాటు ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో సమాచార, రిజర్వేషన్ కేంద్రాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆఽధ్వర్యంలో కాచిగూడ, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్‌షాహి టోంబ్స్ ప్రాంతాల్లో ఏర్పాటైన కేంద్రాల ద్వారా పర్యాటకులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లదలిచిన యాత్రిలకు ప్రత్యేకంగా రవాణా సౌకర్యాన్ని సమకూర్చుతోంది.