Share News

తుమ్మలకు పీసీసీ చీఫ్‌ అభినందనలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:09 AM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన మూడ్రోజుల రైతు పండుగ విజయవంతం కావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అభినందించారు.

తుమ్మలకు పీసీసీ చీఫ్‌ అభినందనలు

  • రైతు పండుగ విజయవంతంపై హర్షం

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన మూడ్రోజుల రైతు పండుగ విజయవంతం కావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అభినందించారు. ఆదివారం మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యా రు. రైతు పండుగలో భాగంగా మూడ్రోజుల పాటు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, యాంత్రీకరణపైనా అవగాహన కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లు ఎంతో ప్ర యోజనకరంగా ఉన్నాయని మహేశ్‌గౌడ్‌ అన్నారు.


ముగింపు సభలో రైతు రుణమాఫీ, రైతుభరోసాపై సీఎం రేవంత్‌ యావత్‌ తెలంగాణకు స్పష్టతనిచ్చారని తెలిపారు. రేవంత్‌ పాలన రైతు రాజ్యంగా మారిందని.. ఇలాంటి తరుణంలో వ్యవసాయ మంత్రిగా రైతుబిడ్డ తుమ్మల ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ను తుమ్మల శాలువాతో సత్కరించారు.

Updated Date - Dec 02 , 2024 | 03:09 AM