Mahesh Kumar Goud: పదవులు కాదు.. పార్టీ శాశ్వతం
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:16 AM
అధికారం, పదవులు శాశ్వతం కాదని.. పార్టీయే శాశ్వతమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, తగిన గౌరవం లభిస్తుందని చెప్పారు.
కష్టపడ్డ వారికే నామినేటెడ్ పదవులు: మహేశ్ గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అధికారం, పదవులు శాశ్వతం కాదని.. పార్టీయే శాశ్వతమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, తగిన గౌరవం లభిస్తుందని చెప్పారు. పార్టీ కోసం పాటుపడ్డ వారిని నామినేటెడ్ పదవుల్లో నియమిస్తామని స్పష్టం చేశారు. గురువారం మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేశ్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో పరస్పర విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణమని, అయితే అవసరమైన సందర్భంలో ఐక్యంగా ప్రత్యర్థి పార్టీలపై పోరాడటం కాంగ్రెస్ ప్రత్యేకత అని చెప్పారు. మూసీ కూల్చివేతలను ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వాటిని తిప్పి కొట్టే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు.