TS News: గాంజా శంకర్ చిత్ర యూనిట్‌కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు
ABN , Publish Date - Feb 18 , 2024 | 10:30 AM
గాంజా శంకర్ చిత్ర యూనిట్‌కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా పేరు నుంచి గంజాయి అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్: గాంజా శంకర్ చిత్ర యూనిట్‌కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా పేరు నుంచి గాంజా అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాలో మాదకద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు గంజాయిని ప్రోత్సహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని అన్నారు. గంజాయికి సంబంధించిన సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూడాలని టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.